HPS-A

Saturday, 4 April 2015

subhashithalu April

subhashithalu

  • స్నేహితుడ్ని దుఖసమయంలో , యోధుడి ని  సమరాంగణం లో ,భార్యను దౌర్భాగ్యం లో ,దారిద్ర్యం లో ,గొప్ప వ్యక్తిని  అతని వినయంలో పరీక్షించాలి . 
  • అంతా  నిన్ను అవమానిస్తునప్పుడు ,వినయంగా  ఉండటం మంచిది కాదు . కానీ అందరూ నిన్ను ప్రశంసిస్తునప్పుడు వినయంగా ఉండటం మాత్రం అరుదైన విషయం . 
  • నిన్నెవరూ  ప్రేమించకుండా ఉన్నట్లైతే అది తప్పకుండా నీ తప్పే  అని తెలుసుకో . 
  • నీవు  గెలిచి తీరతావు అంటే విజయానికి ఆత్మవిశ్వాసమే ముఖ్యమన్నమాట .
  • రాత్రి వేళ సూర్యుడు కనిపించలేదని కన్నీరు కారిస్తే , ఆఖరికి నక్షత్రాలు కూడా నీకు  కనిపించకుండా పోతాయి . 
  • పురుషులు స్వార్ధానికి లోబడి పొరపాట్లు చేస్తారు , స్త్రీలు మాత్రం బలహీనతలకు వశమై  పొరపాట్లు చేస్తారు . 
  • ఎవరైనా  ఏవిధంగా అలోచిస్తారో , ఆ విధంగానే  ప్రవర్తిస్తారు .----రామకృష్ణ పరమహంస.
  • ధీరుడు ఒకేసారి  మరణిస్తాడు .  పిరికివాడు క్షణ క్షణం మరణిస్తాడు . కాబట్టి దేరుడి వలే  ఉండటానికి  ప్రయత్నించాలి . 

  • అడగకుండా ఇచ్చేదే దానం .పాపపు  పనుల నుండి మళ్లించే వాడే  స్నేహితుడు . మంచి స్వభావమే మనిషికి అలంకారం . 
  • ధైర్యసాహసాలు ,ప్రతిభ  ఇవి ప్రతి మానవుడి విజయసాధనకు సోపానాలు . 
  • నిరంతరం  త్రాగేవాడు రుచిచూడడు . అలాగే ఎల్లప్పుడూ  మాట్లాడేవాడు ఆలోచించడు . 
  • హృదయమే  ఉత్తమ బోధకుడు . కాలమే ఉత్తమ గురువు . ప్రపంచమే  ఉత్తమ గ్రంధం .భగవంతుడే ఉత్తమ స్నేహితుడు . 
  • హృదయం లేని మాటలకన్నా ,మాటలు లేని హృదయమే మిన్న. 
  • స్వర్గాన్ని  నరకంగా చేసేది , నరకాన్ని  స్వర్గంగా  చేసేది మన మనస్సే . 
  • మనతో హృదయంను  విప్పి మాట్లాడని  వ్యక్తి దగ్గర మన హృదయాలను విప్పి మాట్లాడకుండా జాగ్రత్త గైకొనాలి. 
  • ప్రశాంతమైన మనస్సు విలువైన మూలధనం. 
  • స్నేహమనేది  రెండు దేహాలతో  ఉండే  ఒకే ఆత్మ . 
  • మిత్రుడిని  క్షమించటం  కంటే  శత్రువుని క్షమించటం చాలా సులభం . సంకుచిత  భావాలూ  గల  స్నేహితుని  కంటే , దుర్మార్గుడైన  శత్రువే  మిన్న .   
  • నిజమైన స్నేహం  నిదానంగా ఎదిగే మొక్క  వంటిది . అది  బాగా పరిణితి చెందటానికి ముందుగా చెడ్డ పరిస్థితుల వల్ల వచ్చే పరిణామాలను తట్టుకుని నిలవాలి . 
  • స్నేహం దఃఖాన్ని భాగిస్తుంది . ఆనందాన్ని హెచ్చిస్తుంది . 
  • ఎదుటి మనిషిని అర్ధం  చేసుకుని నెమ్మదిగా స్నేహాన్ని పెంచుకో , కానీ ఆ స్నేహం పది కాలాల పాటు నిలిచేటట్లు చూసుకో . 
  • మన వినోదాలను మార్చుకోవచు . కానీ మన మిత్రులను మార్చుకోరాదు . 
  • తీసిన కొద్ధీ చెలమలో నీరు ఊరుతుంది . చదివినకొద్ధీ మనిషిలో  వివేకం పెరుగుతుంది . 
  • పెదవి దాటని మాటకు ప్రభువు నీవు పెదవి దాటిన మాటకు నీవు బానిసవు .   I