HPS-A

Monday, 18 May 2015

సూక్తులు may 2015


                                   

         సూక్తులు



  • చేయకూడని పనులు చేయడం  వలన మనిషి ఏ విధంగా చెడిపోతాడో, చేయవలసిన పనులు చేయకపోవడంవల్ల కూడా అంతే చెడిపోతాడు.   
  • రెండు విషయాలు మనిషిని ఆవిష్కరిస్తాయి  :-  ఒకటి : నీ ఓపిక, నీ నిలకడ .... నీ దగ్గర ఏమీ లేనప్పుడు          రెండు:  సమాజంపట్ల  నీ వైఖరి నీ నడత ... నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు.     
  • నిన్ను నువ్వు పొగుడుకోకు .... ఎవరూ హర్షించరు. నిన్ను నువ్వు కించపరుచుకోకు .... అదే  నిజమని అందరూ నమ్ముతారు. 
  • మనిషికి అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే తానేమిటో తనకి తెలుస్తుంది.
  • మనిషి తనని తాను నియంత్రించుకోగలగడం కంటే గొప్ప విజయం  లేదు.
  • సానుకూల పరిణామాలు మనల్ని ఉత్సాహపరుస్తున్న సమయంలోనే కొన్ని ప్రతికూల సంఘటనలొచ్చి కుంగదీస్తాయి. ఆత్మవిశ్వాసం సన్నగిల్లి మార్గం నుంచి పక్కకు తొలగే పరిస్థితులను కల్పిస్తాయి. అలాంటి ఎన్నెన్నో ప్రతికూల పరిణామాలను కూడా ఎదురీది విజేతగా నిలిచిన వారు నిజమైన దీరోదాత్తులు.  
  • తన బలం, బలహీనతలు తెలుసుకుని బలహీనతలు అధిగమించే మనిషికి ఆత్మవిశ్వాసం మెండు.
  • ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నమనిషి  ప్రతికూల పరిస్థితుల్లో కూడాతనని తాను  'ఆవిష్కరించుకోవడం' లో కూడా ముందుంటాడు, విజేతగా నిలుస్తాడు.  
  • కోరికల వల్ల కోపం, కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల  మరుపు, మరుపు వల్ల బుద్ధిహీనత అన్నది గీతాసారం. ఇందులో రహస్యాన్ని తెలుసుకున్న మనిషికి  'వివేచన'  కల్గుతుంది. 'వివేచన' కల్గిన మనిషి ప్రశాంతంత అలవడుతుంది. 
  • తాత్వికులు 'జ్ఞానాన్ని' మూడు విధాలుగా సముపార్జించవచ్చు అంటారు.  అందున మొదటిది  'అనుకరణ' (అంటే అనుకరించడం), రెండవది 'చింతన'. (అంటే గ్రహించడం) మూడవది 'అనుభవం'. ఇది అన్నిటికంటే కష్టమైనది, చేదైనది. అంటే స్వానుభవంతో నేర్చుకునే పధ్ధతి. 
  • తమ తమ శాస్త్రాలలో నిష్ణాతులమని చెప్పుకునేవారు కూడా 'ప్రయోగాలు' కొనసాగిస్తూనే ఉంటారు. అంటే వారికి ఇంకా తెలియనిఉన్నాయనే కదా. ఎన్నో తెలిసినా నాకింకా ఏమీ తెలీదని, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని చెప్పిన వ్యక్తి ' సోక్రటీసు' ఒక్కడే !
  • సప్తపాతకాలు :  దురహంకారం, అర్ధలోభం, కామం, వైషమ్యం, కోపం,శతృత్వం, సోమరితనం.  
  • దుర్లక్షణాలు : కామ, క్రోధ ,లోభ, మోహ, మద, మాత్సర్యాలు.
  • అనుమానం పెనుభూతం. అది మనిషిని ఎంతటి నీచత్వానికైనా దిగజారుస్తుంది పెద్దలెన్నడో చెప్పారు.
    మదిలో ఒకసారి అనుమాన బీజం పడితే చాలు  అది మనిషిని దిద్దుకోలేని తప్పులు చేయిస్తుంది. మనసును నిలువెల్లా కలుషితం చేసి హేతుబద్ధమైన ఆలోచనాశక్తిని నాశనం చేస్తుంది.
    అంతటితో ఆగదు. బుద్ధిని వక్రమార్గం పట్టిస్తుంది. నిజం చెప్పాలంటే నీచత్వానికి దిగజారుస్తుంది.
    అంతే కాదు. మనిషిని క్రూరులుగా మారుస్తుంది.   
                       
  • మనుషులు 'సాయం ' చేసినంతమాత్రాన వారిలో  నీచత్వాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు !
  • ఏదీ అనుకున్నట్లుగా జరుగకపోవచ్చు. కానీ  'కరుణ' 'రాజీ' అన్నవి మనుషుల జీవితాల్లో చాలా అవసరం.
  • సాధన, శోధన, తపన, ఆవేదన, సంకల్పం  అనేవి  జిజ్ఞాసను వృద్ధిపరచుకునేందుకు అనువైన లక్షణాలు.    
  • జిజ్ఞాస లేకపోతే జ్ఞానం పెరగదు. జ్ఞానవృద్ధి జరక్కపోతే 'మేధ' వికసించదు. మేధ లేని నరుడు భూమికి, జాతికీ భారమవుతాడు. జిజ్ఞాస పిపాసికే ఆత్మజ్ఞాన ప్రాప్తి సాధ్యం. 
  • పాపాలు చేసి దేనినీ సంపాదించవద్దు.
  • అతి 'ఖర్చు' అప్పులకు దారి.
  • అతి తిండి అజీర్తికి హేతువు.
  • మనఃస్పర్ధలు కలిగించేలా మాట్లాడకండి. 
  • జీవితంలో 'ప్రాధాన్యాలు' లేకుంటే జీవితం 'స్తబ్దు'గా తయారవుతుంది. అందుకే మనిషి  తన జీవితంలో తగిన  'ప్రాధాన్యాలు' ఎంచుకుని అటుగా పయనం సాగించాలి.                                                    
  • ఓర్పు, సహనం ఎంత చేదుగా ఉంటాయో వాటి వల్ల లభించే ఫలం అంత తియ్యగా ఉంటుంది.
  • ఆత్మ విశ్వాశం మనిషికి పెట్టని ఆభరణం.
  • భయపడే మనస్తత్వం ఉన్నవారికి ఎప్పుడు ప్రమాదం పొంచే ఉంటుంది.
  • పొగడ్తల కంటే సద్విమర్శలు మనిషికి ఎప్పుడూ మేలు చేస్తాయి, ఉపయోగపడతాయి.
  • ఇతరుల అభిప్రాయాలకు భయపడినంత కాలం మనం ఏ పనిలోనూ విజయం సాధించలేము.
  • ఈలోకంలో నాకేమీ తెలియదని తప్పించుకునేవాడు చాలా తెలివికలవాడు. నాకు అన్నీ తెలుసు
    అని చెప్పేవాడు నిందల పాలవుతాడు. ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండేవాడు చాలా
    బుద్దిమంతుడనిపించుకుంటాడు.
  • రేపటి నీ భవిష్యత్తు మరెక్కడో లేదు. రోజువారీ నీ దినచర్యలోనే ఉంది !
  • హృదయం నిండా ఇతరులపట్ల సానుభూతి పొంగిపొరలే మనిషికి మాత్రమే వారిని విమర్శించే
    అధికారం ఉంటుంది.
  • ఏ ఆదర్శము లేని మనిషి తెడ్డు లేని నావ వంటివాడు.
  • జీవితంలో వచ్చే ప్రతిరోజు క్రితంరోజుకన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాల్ని నేర్పుతుంది.
    ఏ దేశానికైనా పెద్ద సంఖ్యా బలం ఉంటె చాలదు. ప్రజలు విద్యావంతులై , చైతన్యవంతులై,
    ఆత్మగౌరవంతో ఉన్నప్పుడే  'జాతి'  జాగృతమవుతుంది, బాగుపడుతుంది.
  • ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఓర్పు, సహనంతో వెతికితే అది దొరుకుతుంది.
  • ప్రోత్సాహం లేదని మంచిపనిని వాయిదా వేయకండి.
  • అహంకారం కలవారు అవతలిమనిషిని మనసారా అభినందించలేరు.
  • విజయం సాధించిన ప్రతి మనిషి వెనక  ఓ సాహసోపేతమైన నిర్ణయం తప్పక ఉండేవుంటుంది.
  • అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు. అది జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు.
  • వేలకోట్ల ధనరాసుల కధిపతివైనా ఒక్క 'నిముషం' ఆయుషుని కొనలేవని తెలుసుకో!
  • నీ పొరపాట్లు, తొందరపాటు మరొకరికి అగచాటు కాకూడదు.
  • నీవు తిన్నది మట్టిపాలు, ఇతరులకిచ్చింది నీ 'పాలు'.
  • అనుకున్నామని జరగవు అన్నీ....అనుకోలేదని ఆగవు కొన్ని!
  • మనకు కావాలి అనుకున్నది దొరకనప్పుడు మనకు దొరికినదే 'కావాలి' అని అనుకోవడం ఉత్తమం.
  • జరిగేదేదో జరుగక మానదు. నీ అనవసర ఆందోళనతో జరిగే మార్పు ఏమీ ఉండదు.              
  • 'కల'లంటే నిద్రలో వచ్చేవే కాదు అవి సాకారం అయ్యేదాకా నిద్ర పోనివ్వనివి కూడా ! '
  • అందరినీ అన్నివేళలా సంతృప్తిపరచాలంటే ఓటమి తప్పదు.   
  • 'విజయం'  నిన్ను పదిమందికి పరిచయం చేస్తుంది. ఓటమి తో నీకు ప్రపంచం పరచయమవుతుంది. 
  • 'విజయాలు' తలకెక్కుతే  ఇక విజయాల బాట తప్పినట్లే ! 
  • 'విజయం ...గెలుపు'  శాశ్వతం కావు .  అలాగే  అపజయం ... ఓటమి  'అంతిమం' కావు.  
  • వైఫల్యాలు  సాధారణంగా 'నిరాశ, నిర్లిప్తత'కు దారితీస్తాయి. వాటిని  అధిగమించే వాడే గెలుపు బాట  పడతాడు'.
  • భక్తి మార్గాలు :   సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం. (తొమ్మిది ) 
  • ఇతరుల్ని అదేపనిగా ప్రశ్నిస్తూ 'సవాలు' చేయువాడు, ఆక్షేపించువాడు, ప్రతివిషయాన్ని అభ్యంతరపెట్టువాడు ఏదో ఒకరోజు ఓడిపోకతప్పదు. అదే తనని తాను  'ప్రశ్నించు' కొనువాడు నిజ వర్తమానంలో జీవిస్తాడు ! ఆట కానీ జీవితం కానీ  గెలుపు, ఓటములు సమానంగా తీసుకుంటేనే మనిషి మనుగడ.
  • చీకటి వెంట వెలుగు ఎలానో ఓటమి తరువాత గెలుపు అంతే అనుకోని రోజున మనిషి ప్రయత్నం చెయ్యడం మానేస్తాడు.