ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
Updated : 6/7/2015 12:40:37 AM
Views : 33
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ గత నెలలో నిర్వహించిన ఎస్సెస్సీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య శనివారం ఫలితాలను విడుదల చేశారు. 48.93 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలనూ విడుదల చేశారు. ఫలితాలను www. telanganaopenschool.org/, www.schools9. వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వరశర్మ తెలిపారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 10 నుంచి 23 వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. రీ కౌంటింగ్ కోసం రూ.200, రీ వెరిఫికేషన్ కోసం రూ.600 ఫీజు నిర్ణయించారు.
No comments:
Post a Comment